Monday, January 20, 2025

తాగునీటికే కృష్ణా జలాలు

- Advertisement -
- Advertisement -

నీటి నిల్వలపై ప్రభుత్వానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణాబేసిన్ పరిధి లో ఉన్న ప్రాజెక్టుల్లో నిల్వ నీటిని తాగునీటి అవసరాలు తీ ర్చేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ నిర్ణయించింది. బుధవారం జలసౌధలో ఇఎన్‌సి మురళీధర్ అధ్వర్యంలో సమావేశం జ రిగింది. ఈ సమావేశంలో కృష్ణా, నదుల పరీవాహకంగా ఉన్న ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఎంత నీరు నిలువ ఉంది, రాష్ట్రంలో వేసవి అవసరాలకు ఎన్నీ టిఎంసిల నీరు అవస రం , యాసంగి పంటలకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉం దా, ఉంటే ఎంత నీటిని, ఎన్ని ఎకరాల ఆయకట్టుకు అందిం చే అవకాశాలు ఉన్నాయి తదితర అంశాలను చర్చించారు.

కృష్ణా పరీవాహకంగా ఉన్న జలాశయాల్ల్లో నీటి అం త ఆశాజనకంగా లేని కారణంగా ఉన్న అరకొర నీటిని తా గునీటి అవసరాలకే నిల్వ ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తు తం జూరాలలో 8.13టిఎంసిలు, శ్రీశైలంలో 57టిఎంసిలు, నాగార్జున సాగర్‌లో 153 టిఎంసిల నీరు నిలువ ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజీ కింద మిగిలిపోయే నీటిని మినహాయి స్తే ఉన్న కొద్దిపాటి నీటి నిలువలు వచ్చే ఆగస్ట్ వరకు తాగునీటికే సరిపోతాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇక గోదావరి నదీ పరీవాహకంగా శ్రీరాంసాగర్‌లో 78టిఎంసి, 16టిఎంసిలు, కడెంలో 4టిఎంసిలు, నిజాంసాగర్‌లో 16టిఎంసిలు, సింగూరులో 25టిఎంసిలు, మిడ్‌మానేరులో 19,లోయర్ మానేరులో 19టిఎంసిలు నిల్వ ఉన్నా యి.

డెడ్‌స్టోరేజీ, నీటి నష్టాలను అంచనా వేసి మిగిలిన నీటిని ఆరుతడి పైర్లకు ఎంత విస్తీర్ణంలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నది అంచానా వేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలపై నివేదికను ప్రభుత్వానికి అం దజేయనున్నట్టు నీటి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమవేశంలో ఇఎన్‌సితో పాటు ఆయా ప్రాజెక్టుల సిఇలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News