Wednesday, December 25, 2024

ఓట్ల కోసమే ట్రిబ్యునల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో జరిగిన బహిరంగ సభలో కేం ద్ర ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణ ఏర్పడిన నెల రోజుల తరువాత సిఎం కెసిఆర్ కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 10 సా ర్లు వినతిపత్రాలు, ప్రత్యేకంగా జలవనరుల శాఖ మంత్రి, ప్రధాని న రేంద్ర మోడీని కలిసినా  స్పందించలేదని, కుంభ కర్ణునిలా మొద్ర నిద్ర పోయి ఓట్ల కోసం జలాల పంపిణీకి ప్రయత్నాలు మొదలు పెట్టిందని మండిపడ్డారు. గతేడాదిలో మరోసారి నీటి వాటాలపై కేంద్రానికి గట్టిగా నిలదీస్తే సుప్రీం కోర్టులో కేసు వాపసు తీసుకుంటే పరిష్కారిస్తామని బెదిరింపులు చేసిందని మండిపడ్డారు. నేడు కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ఉద్యమం పోరాట ఫలితమేనన్నారు. కృష్ణాజలాలు ఎక్కువగా మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే ప్రవహిస్తున్నాయని ఎక్కువ వాటా ఈ జిల్లాకే దక్కాలని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది కూడా సమాన జాలాల వాటా కోసమేమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లా మరో కోనసీమగా మారబోతోందన్నారు. ఇదంతా సిఎం కెసిఆర్ కృషి, ముందు చూపు ఆలోచననే కారణమని ఇప్పటికే కృష్ణానది పై పలు ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని,పాలమూరు రంగారెడ్డి లిఫ్టును కూడా పూర్తి చేసుకొని ప్రారంభించుకున్న నేపథ్యంలో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డితో పాటు భీమా,జూరాల, కల్వకుర్తికి నికర జలాలు వాటా వస్తుందని చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని కేవలం కాలువలు మిగిలాయని వాటిని త్వరలో పూర్తి చేసుకొని ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News