Friday, December 20, 2024

కృష్ణమ్మ పరవళ్ల్లతో పులకించనున్న దక్షిణ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : తెలంగాణ ప్రజల కళలు సాకారం చేయడంలో మన ముఖ్య మంత్రి కెసిఆర్ కార్యధిక్షుడు అయినాడు అని ఆదివారం తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, పౌర సంబంధాలు మరియు సమాచార శాఖ మాత్యులు గౌరవ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణా జలాలతో అనంతగిరి అటవీలో గల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం చేసి, కృష్ణ జలాలు పుష్కరణిలో కలిపారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరాయి పాలనలో మాటలకు పరిమితం చేసిన దశాబ్దాల కళలను, ఉక్కు సంకల్పంతో కార్యధీక్షుడై మన కలలను సాకారం చేస్తూ… బీడు భూములకు సాగునీరు మళ్లిస్తున్న ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు అపర భగీరథుడు సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శనివారం ప్రారంభించి సాగు నీరు అందిస్తాను మాట నిలుపుకున్నారని,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో 12 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీటితో పాటు 1226 గ్రామాలకు తాగునీరు అందిస్తూ జంట నగరాలకు సైతం తాగునీరును అందించే భారీ ప్రాజెక్ట్ అని అన్నారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 7 లక్షల ఎకరాలకు తాగునీరు అందడంతో పాటు 500 గ్రామాలకు తాగునీరు అందించే వీలుకలిగినది అని, అదేవిదంగా వికారాబాద్ జిల్లాలో 3లక్షల 41,000 ఎకరాల సాగునీటిని పంటభూములకి మల్లించుకొని కళ సాకారం అయిందని కొనియాడారు.పాలమూరు – రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలోజిల్లా రైతు సంఘం అధ్యక్షులు పాతూర్ రాంరెడ్డి,మున్సిపల్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News