Thursday, February 6, 2025

బాలికపై ముగ్గురు ఉపాధ్యాయులు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

చెన్నై: తప్పు దారిపట్టిన విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిందే పోయి ఓ ఉపాధ్యాయులు దారి తప్పి కామకీచకులుగా మారారు. విద్యాబుద్ధులు నేర్పి భావి పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన గురువులు దారి తప్పారు. ఎనిమిదో తరగతి విద్యార్థినిపై టీచర్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కృష్ణగిరి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో చదువుచెబుతున్న ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై కన్నేశారు. ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై అత్యాచారం చేశారు.

తరువాత బాలిక నెల రోజుల నుంచి బడికి రాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు వాళ్ల ఇంటికి వెళ్లాడు. తన కూతురు గర్భం దాల్చిందని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడికి చెప్పడంతో షాక్‌కు గురయ్యాడు. అబార్షన్ చేయించడానికవ వెళ్తున్నామని చెప్పాడు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు బాలల భద్రతా అధికారులకు సమాచారం ఇచ్చాడు. బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కామ పిశాచాలైన ఉపాధ్యాయులు ప్రకాశ్(37), చిన్నస్వామి(57), ఆరుముగం(45) అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News