Monday, January 20, 2025

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి

- Advertisement -
- Advertisement -

రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్ హౌస్‌లో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్… కృష్ణంరాజు భౌతిక కాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ దహన సంస్కారాలు జరిగాయి. ఇక అంతకుముందు జూబ్లీ హిల్స్ లోని నివాసం వద్ద పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు భౌతిక కాయానికి తుది నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపి డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జయప్రద, కోట శ్రీనివాస రావు, అల్లు అరవింద్, మంచు మనోజ్, రోజా, అల్లరి నరేష్, సునీల్, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సుధీర్‌బాబు తదితరులు ఆయన భౌతిక కాయానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్ నివాసం నుంచి మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్ హౌస్ వరకు కృష్ణంరాజు పార్ధీవ దేహానికి అంతిమ యాత్రని నిర్వహించారు. సినీ ప్రముఖులు, వేలాదిమంది రెబల్‌స్టార్ అభిమానులు కడసారి చూపు కోసం భారీ సంఖ్యలో ఫామ్‌హౌస్‌కు తరలివచ్చారు. అయితే కొందరిని మాత్రమే ఫామ్‌హౌస్‌లోకి అనుమతించారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ కృష్ణంరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు.

Krishnam Raju Final Rites

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News