Wednesday, January 22, 2025

మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న ‘కృష్ణమ్మ’

- Advertisement -
- Advertisement -

సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం కృష్ణమ్మ. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను శుక్రవారం భారీ ఎత్తున విడుదల చేశాయి. సత్యదేవ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా కృష్ణమ్మ మన్ననలు అందుకుంటోంది.

ఈ హీరో సినీ కెరీర్‌లో ‘కృష్ణమ్మ’ సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజునే 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సినిమా రాబట్టుకుంది. ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నేపథ్యంలో విడుదలైన ‘కృష్ణమ్మ’ మంచి కలెక్షన్స్ రాబట్టుకోవటం విశేషం. సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే. ‘కృష్ణమ్మ’ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుంచే కాదు, అటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News