Saturday, December 28, 2024

మే 31న థియేటర్లలో ‘మోసగాళ్లకు మోసగాడు’..

- Advertisement -
- Advertisement -

”పద్మాలయ సంస్థకు పునాది మోసగాళ్లకు మోసగాడు చిత్రం. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసినప్పటికీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమిది. అభిమానులు కోరిక మేరకు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని అన్ని హంగులతో 4కేలో మళ్ళీ విడుదల చేస్తున్నాం” అని తెలియజేశారు ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ సోదరులు ఆదిశేషగిరి రావు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత అశ్విని దత్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు బి.గోపాల్, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ “అభిమానులు కోరిక మేరకు కృష్ణకు ఘనమైన నివాళిగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కౌ బాయ్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాలో దర్శకుడు కేఎస్‌ఆర్ దాస్, కెమెరామెన్ వీఎస్‌ఆర్ స్వామీ, రచయిత ఆరుద్ర, సంగీత దర్శకులు ఆదినారాయణ.. ఇలా అందరూ అద్భుతమైన పనితీరు కనబరిచారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News