Friday, April 4, 2025

నా పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి

- Advertisement -
- Advertisement -

Krithi Shetty about 'Macherla Niyojakavargam'

హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఈనెల 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపధ్యంలో కృతిశెట్టి మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నా పాత్ర పేరు స్వాతి. నా పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. సీన్‌ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. నా పాత్ర చాలా బ్యూటీఫుల్‌గా వుంటుంది. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది. చాలా అద్భుతమైన కథ ఇది. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. పొలిటికల్ టచ్‌తో పాటు మంచి సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మంచి ప్యాకేజీగా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎంతగానో ఇష్టపడతారు.

ఈ చిత్రం ఒక లాంగ్ వీకెండ్ లోవస్తోంది. ఫ్యామిలీస్ అంతా థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. నితిన్ నాకు మంచి స్నేహితులయ్యారు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం కూడా వుంది. దర్శకుడు రాజశేఖర్ చాలా కూల్ పర్సన్. ఎప్పుడూ కోపం రాదు. చిరాకు పడరు. ప్రతి సీన్‌ని చాలా క్లియర్‌గా చెబుతారు. ఫస్ట్ టైం దర్శకుడిలా అనిపించరు. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభూతినిచ్చింది. ఆయనకి గొప్ప విజయాలు దక్కాలని కోరుకుంటాను. ఒక నటిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. ‘ఉప్పెన’ తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాజెక్ట్ సైన్ చేశాను. అయితే వరుసగా కమర్షియల్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంద్రగంటి, సూర్య చిత్రాలలో భిన్నంగా కనిపిస్తా. కొత్త కథల విషయంలో కూడా కొంచెం సెలెక్టివ్‌గా ఉంటున్నా. ప్రస్తుతం సూర్యతో ఒక సినిమా, అలాగే నాగచైతన్యతో మరో సినిమా, ఇంద్రగంటి సినిమా చేస్తున్నా. ఇంకొన్ని కథలు చర్చల్లో వున్నాయి”అని అన్నారు.

Krithi Shetty about ‘Macherla Niyojakavargam’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News