Sunday, December 22, 2024

దుల్కర్‌కు జంటగా కృతిశెట్టి?

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ కృతి శెట్టి మొదటి సినిమా ‘ఉప్పెన‘ తోనే అందరి దృష్టి ఆకర్షించి ఓవర్ నైట్‌స్టార్ అయ్యింది. ఆ వెంటనే ‘శ్యామ్ సింగ రాయ్’తో మరో హిట్ కొట్టడంతో టాలీవుడ్‌లో కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కృతిశెట్టి తాజాగా మనమే సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చి అలరించింది, ఇప్పుడీ ముద్దుగుమ్మను మరో అవకాశం వరించింది. దుల్కర్ సల్మాన్ సరసన ఓ సినిమాలో నటించే అవకాశం దక్కింది. దుల్కర్ సినిమాలో ఛాన్స్ అంటే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వస్తుంది. సౌత్ లో పాపులర్ అవుతుంది. సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు దుల్కర్. రానా నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో కృతిని హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News