Monday, December 23, 2024

పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో…

- Advertisement -
- Advertisement -

పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో హీరోయిన్ కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మి రోల్ చేశారు. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా కృతి శెట్టి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
వెంటనే ఒప్పుకున్నా…
లింగుస్వామి తీసిన ‘ఆవారా’ను చాలా ఏళ్ళ క్రితం తమిళంలో చూశా. ఆ సినిమా నాకొక జ్ఞాపకం. ఇక లింగుస్వామి ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చెప్పిన కథ విన్న తర్వాత వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.
పాటలు మాసివ్ హిట్…
సినిమాలోని ‘బుల్లెట్…’ సాంగ్ క్లాస్ అయితే ‘విజిల్…’ సాంగ్ మాస్. ఈ రెండు పాటలు మాసివ్ హిట్ అయ్యాయి. ఈ పాటలకు ముందు వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. హీరో రామ్‌తో కలిసి ఈ పాటలను ఎంజాయ్ చేస్తూ చేశాను.
పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో…
‘ది వారియర్’లో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. సినిమాలో నా పాత్ర చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే.
అక్కడ ప్రేమ చిగురిస్తుంది…
సినిమాలో రామ్ పోలీస్ రోల్ చేశారు. నాది ఆర్జే రోల్. పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్యలో రైల్వే స్టేషన్. అక్కడ మా మధ్య ప్రేమ చిగురిస్తుంది. నా పాత్ర కోసం తెలుగు ఆర్జే వీడియోస్ చాలా చూశా. వాయిస్ వినిపించినప్పుడు ఆర్జే కనిపించకపోయినా… ఎక్స్‌ప్రెషన్ ఫీల్ అవ్వాలి. అది గమనించాను.
తమిళం నేర్చుకుంటున్నా…
ఇది బైలింగ్వల్ సినిమా. తమిళంలో కూడా షూట్ చేశాం. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నాను. అందులో సూర్య హీరో. ఇక నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా చేస్తున్నా. అదీ తెలుగు,  తమిళ్ బైలింగ్వల్. అందుకని తమిళం నేర్చుకుంటున్నాను.

Krithi Shetty interview about ‘The Warrior’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News