Thursday, December 26, 2024

ఒక నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతిశెట్టి హీరోయిన్‌గా, నిర్మాతలు బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి మీడియాతో మాట్లాడుతూ… ‘ఈ సినిమాలో నా పాత్రకు చాలా మంచి స్పందన వచ్చింది. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఫోన్ చేసి ‘నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లువుంది’ అని చెపుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. ఇంత మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం. ఇంద్రగంటి సినిమా షూటింగ్ స్పెషల్‌గా ఉంటుంది. దాదాపు 70 రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. ఇంద్రగంటి చాలా కూల్. తన పనిని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా అంశాలు ఆయన నుండి నేర్చుకున్నాను. సుధీర్ బాబు వండర్ ఫుల్ కోస్టార్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా అంకితభావంతో పని చేస్తారు. ప్రస్తుతం నాగ చైతన్య, సూర్యతో సినిమాలు చేస్తున్నా. మరికొన్ని ప్రాజెకట్స్ లైనప్‌లో వున్నాయి’ అని అన్నారు.

Krithi Shetty Special interview About AAGMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News