బాలీవుడ్ భామా కృతిసనన్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్‌తో కలిసి కృతిసనన్ భారీ మైథలాజికల్ మూవీ ‘ఆది పురుష్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘నేను సెట్స్‌లో ప్రభాస్‌ను తొలిసారి చూసినప్పుడు తను సిగ్గుపడ్డారు. అందరూ ఎందుకు ఆయనని షై పర్సన్ అని పిలుస్తారో అప్పుడు నాకు తెలిసింది. అయితే షాట్ బ్రేక్‌లో నేను ప్రభాస్‌ని కలుసుకున్న తరువాత వెంటనే నాతో ఫ్రీగా మాట్లాడటం మొదలుపెట్టారు. తను ఇంత త్వరగా నాతో ఫ్రీగా మాట్లాడి కలిసిపోతారని నేను ఊహించలేదు. దాంతో ప్రభాస్ మాట్లాడగానే ముందు ఆశ్చర్యపోయాను. నిజంగా ప్రభాస్ ఓ స్వీట్ పర్సన్. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుంది’ అని చెప్పింది. అంతే కాకుండా ‘ఆదిపురుష్’లోని సీత పాత్రలో నటించడానికి ఇబ్బందిపడుతుంటే ప్రభాస్ హెల్ప్ చేశారని డైలాగ్ డిక్షన్ విషయంలో ఆయన సహకరించారని కృతిసనన్ వెల్లడించింది. భారీ స్థాయిలో 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న ‘ఆది పురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది.
Kriti Sanon about Prabhas on Adipurush Sets