Sunday, December 22, 2024

ఆదిపురుష్ నుంచి సీతగా కృతి సనన్.. పోస్టర్ లాంచ్..

- Advertisement -
- Advertisement -

భారత ఇతిహాసాల్లోనే అత్యంత గౌరవించదగిన మహిళా సాథ్వి సీత. ప్రస్తుతం ఆదిపురుష్ తో ప్రభాస్, కృతి సనన్ జంటగా రామాయణ గాథను తెరకెక్కించాడు ఓం రౌత్. సీతా నవమి సందర్బంగా.. అంకితభావం, నిస్వార్థత, శౌర్యం మరియు స్వచ్ఛతకు ప్రతిరూపం జానకి. కృతి సనన్ నటించిన జానకి మంత్రముగ్ధమైన రూపం తో ఉన్న మోషన్ పోస్టర్‌ తో పాటు.. ‘రామ్‌ సియా రామ్‌’ ఆడియో టీజర్‌ ను కూడా విడుదల చేశారు.

Also read: స్టీల్‌ప్లాంట్‌ పోరాటాల ఇతివృత్తంతో.. ‘ఉక్కు సత్యాగ్రహం’

జానకి పాత్రలో కృతి సనన్ స్వచ్ఛత, దైవత్వం మరియు ధైర్యాన్ని రాఘవ్ భార్యగా సూచిస్తుంది. రాం సియా రామ్ ట్యూన్ జానకికి రాఘవ పట్ల ఉన్న అచంచలమైన భక్తిని తెలియజేసేలా ఉంది. ఈ పాట ప్రేక్షకులను ఆధ్యాత్మికత, భక్తి ప్రపంచానికి తీసుకువెళుతుంది. ఈ గీతాన్ని సచేత్-పరంపర స్వరపరిచారు.ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ను టి-సిరీస్ భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ తో పాటు యు వి క్రియేషన్స్ ప్రమోద్, వంశి నిర్మించారు.16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News