Wednesday, January 22, 2025

కోలీవుడ్‌లోకి కృతి

- Advertisement -
- Advertisement -

Kriti shetty act with surya

అందాల భామ కృతి శెట్టి ఇప్పటికే తెలుగులో అనేక చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు తమిళంలో పెద్ద హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ బ్యూటీ తమిళ సూపర్ స్టార్ సూర్య సరసన నటించనుంది. ‘శివపుత్రుడు’ దర్శకుడు బాలా సూర్య హీరోగా ఒక కొత్త సినిమా మొదలుపెడుతున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా కృతి శెట్టి ఎంపికైంది. ఆమెకిది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఇక కృతిశెట్టి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (సుధీర్ బాబు సరసన), ‘మాచర్ల నియోజక వర్గం’ (నితిన్‌తో), ‘వారియర్’ (రామ్ సరసన) చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. తెలుగులో ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News