Friday, December 20, 2024

లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి

- Advertisement -
- Advertisement -

Kriti Shetty

చెన్నై:  ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి  ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసి పేరు తెచ్చుకుంది. కాగా తాజాగా తమిళనాట జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి  ఏడ్చేసింది.

ఇంటర్వ్యూ జరుగుతుండగా ఇద్దరు యాంకర్లు కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఒకరికొకరు పోటీపడ్డారు. తర్వాత ఒకరిపై మరొకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్‌ మరో యాంకర్‌ను కొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని కృతిశెట్టి భయపడిపోయింది. అయితే ఆ తర్వాత అది ప్రాంక్‌ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ‘ఎందుకు ఏడ్చారు, ఏమైంది?’ అని ప్రశ్నించారు. దానికి ‘ఎవరైన హార్డ్‌గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది’ అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News