ఇక ఈ సీజన్‌లో లక్నో అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. గాయంతో కెప్టెన్ కెఎల్ రాహుల్ అర్ధాంతరంగా జట్టుకు దూరమైనా దాని ప్రభావం కనిపించలేదు. కృనాల్ పాండ్య అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుండి నడిపించాడు. కీలకమైన మ్యాచుల్లో లక్నో అద్భుతంగా రాణించింది. లీగ్ దశలో బెంగళూరు, ఢిల్లీ, సన్‌రైజర్స్, రాజస్థాన్, ముంబై, పంజాబ్, కోల్‌కతా వంటి బలమైన జట్లను లక్నో ఓడించింది.
డికాక్, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్య, స్టోయినిస్, అయూష్ బడోని, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్ వంటి బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. స్టోయినిస్, బడోని, పూరన్‌లు ఈ సీజన్‌ల అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నారు. ముంబైపై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేగాక కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, గౌతమ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకు కూడా గెలుపు అవకాశాలు సమంగానే కనిపిస్తున్నాయి.