Monday, January 20, 2025

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ హనుమాన్‌నగర్ కాలనీలో దివ్యాంగుల పింఛన్ రూ. 3016 నుంచి రూ.4016 పెంపు పట్ల ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచింది.

ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ రూ. 1000 పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ నెలా రూ. 3016 అందుకుంటున్న దివ్యాంగులు ఇక నుంచి రూ. 4016 పింఛన్ అందుకోనున్నారు. మంచిర్యాల సభా వేదికగా దివ్యాంగుల పింఛన్ పెంచ బోతున్నట్లు ప్రకటించిన సిఎం కెసిఆర్ సంబంధిత ఫైల్‌ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో 5,16,890 మంది లబ్ధిదారులకు పెరిగిన పింఛన్లు వర్తించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొట్ల మనోహర్, శ్రీనివాస్, కుమార్‌రెడ్డి, చిర్ర శ్రవణ్, రాజ్‌కుమార్, వెంకటేశ్, సుమన్, శ్రీకాంత్, రాజేష్, రాంచందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News