Wednesday, January 22, 2025

సరికొత్త జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన క్షేమ జనరల్ ఇన్సూరెన్స్

- Advertisement -
- Advertisement -

ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా పంటల బీమాపై అవగాహన పెంచే లక్ష్యంతో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఈరోజు తమ జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సమగ్ర ప్రచారంలో ప్రధాన అంశం టీవీ ప్రచారం, ఇది రుతుపవనాల ప్రారంభంతో రైతులు విత్తడం ప్రారంభించిన వేళ వారికి చేరుతుంది. ప్రింట్, డిజిటల్, అవుట్‌డోర్ మీడియాలో ఏకకాలంలో చేసే ప్రచారం ద్వారా ఈ టీవీ ప్రచారం మరింతగా రైతులకు చేరుతుంది. విపరీతమైన వాతావరణ సంఘటనలు తరచుగా ఎదురుకావడంతో పాటుగా అవి తీవ్రమవుతున్న వేళ రైతులకు ఆర్థిక భద్రతా వలయాన్ని రూపొందించడంలో పంట బీమా యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రచారం వెల్లడిస్తుంది.

ఈ 30 సెకన్ల టీవీ ప్రచారాన్ని రైతులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, క్షేమ యొక్క వినూత్న పంట బీమా పథకం సుకృతి, ప్రకృతిని సులభంగా అందుబాటులో ఉంచటానికి అంతర్గతంగా అభివృద్ధి చేయబడింది. ఈ ఉత్పత్తి గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలిగే క్షేమ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. బీమా చేయదగిన ఆదాయం ఉన్న ప్రతి రైతు లేదా వారి కుటుంబ సభ్యుడు ఈ అనుకూలీకరించదగిన పంట బీమాను ఎకరాకు రూ. 499 నుండి కొనుగోలు చేయవచ్చు. ఒక పెద్ద, ఒక చిన్న ప్రమాదం కలయిక నుండి 100 కంటే ఎక్కువ పంటలను రక్షించవచ్చు. వారు చేయాల్సిందల్లా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, నమోదు చేసుకుని, తమ పొలాన్ని జియో ట్యాగ్ చేసి ప్రీమియం చెల్లించడం.

ఈ టీవీ ప్రచారం విడుదల గురించి క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ భాస్కర్ ఠాకూర్ మాట్లాడుతూ.. “ పంట బీమా సహాయంతో, పంట నష్టాన్ని తగ్గించడం మరియు దాని ఫలితంగా వచ్చే ఆదాయ నష్టాల గురించి అవగాహన కల్పించడానికి మేము తండ్రీ-కూతుళ్ల బంధం యొక్క అద్భుతమైన చిత్రాలపై ఆధారపడ్డందుకు నేను సంతోషిస్తున్నాను. రైతులను ఆదాయ నష్టాల నుండి రక్షించడం, ఆర్థిక స్థిరత్వం ను పెంపొందించడం ప్రాముఖ్యతను తెలియజేయడానికి మేము తండ్రి, కుమార్తెల మధ్య సంభాషణ యొక్క భావోద్వేగ లోతును ఎంచుకున్నాము. పిల్లలు అమాయకత్వం తోనే అయినా చాలా పదునైన ప్రశ్నలను అడగవచ్చు, అవి పెద్దలను ఆలోచించేలా చేస్తాయి. విపత్తుల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి పంట బీమాను కొనుగోలు చేయాలనే మా సందేశాన్ని అందించడానికి మేము ఆ అమాయకత్వాన్ని ఎంచుకున్నాము..” అని అన్నారు.

ఈ చిత్రం తన పొలంలో పని చేసే ఒక రైతు తన కూతురితో కలిసి భోజనం చేయడానికి కూర్చుని ఉండగా ప్రారంభమవుతుంది. ఆమె తన తండ్రిని, నాన్నా మీరు ఎందుకు ఇంతగా కష్టపడాలి అని అమాయకంగా అడుగుతుంది. దానికి ఆయన ప్రేమగా, ప్రతి ఒక్కరికి వారి టేబుల్‌పై ఆహారం ఉండేలా చేసేందుకు తాను కష్టపడి పనిచేస్తానని, తద్వారా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని అతను వివరిస్తాడు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన ఉన్నారని కూతురు గర్వంగా చెబుతుంది కానీ తనకు ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తనని ఎవరు చూసుకుంటారని ఆందోళనతో అడుగుతుంది. ఆ ప్రశ్నతో ఆందోళన చెందుతున్న రైతు వైపుకు కెమెరా మళ్లుతుంది. ఆపై ఏ రైతు అయినా యాప్ ద్వారా సుకృతిని సులభంగా కొనుగోలు చేయవచ్చని వివరిస్తూ వ్యాఖ్యాత క్షేమ యాప్ గురించి చెబుతుండటంతో యాప్ కనిపించటం ద్వారా చిత్రం ముగుస్తుంది.

హిందీ, కన్నడ, మరాఠీ, క్షేమ సుకృతి పంట బీమా రూ. 499/ఎకరం నుండి ప్రారంభం – YouTube టీవీ ప్రచారాల యూట్యూబ్ లింక్ ఇక్కడ ఉంది.

ఈ టీవీ ప్రచారం దేశంలోని న్యూస్, మ్యూజిక్, మూవీస్, సాధారణ వినోద ఛానెల్‌లలో ప్రసారం చేయబడుతుంది. సహజమైన ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో పంటల బీమా పోషించే కీలక పాత్ర గురించి అవగాహన కల్పించడానికి మెరుగైన డిజిటల్ ప్రచారం ద్వారా ఈ కొత్త వాణిజ్య ప్రకటన తోడ్పడనుంది.

వ్యవసాయ, అనుబంధ రంగాలు 2021-22 యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 45.5 శాతంగా ఉన్న శ్రామికశక్తిలో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశ జిడిపికి దాదాపు 15 శాతం దోహదం చేస్తాయి. అయితే, వ్యవసాయ సమాజాన్ని అసమానంగా ప్రభావితం చేసే వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తు సంఘటనలు చాలా తరచుగా, తీవ్రంగా మారుతున్నాయి. ఈ సహజ విపత్తుల వల్ల పంట నష్టపోవడమే కాకుండా జీవనోపాధి నష్టానికి కూడా దారి తీస్తుంది, ఎందుకంటే 85 శాతం మంది రైతులు తక్కువ వార్షిక ఆదాయాన్ని కలిగి ఉన్నారు.

ఈ కష్ట సమయాల్లో వ్యవసాయ కమ్యూనిటీకి తోడ్పడేందుకు తగిన విధంగా రిస్క్ మ్యాపింగ్ చేసి, నష్టాన్ని విశ్లేషించిన తర్వాత వారికి తగిన బీమా ఉత్పత్తులను అందించడం ద్వారా క్షేమ వారికి మద్దతునివ్వడానికి ప్రయత్నిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News