- Advertisement -
కేరళ లోని కొటరక్కర దిండిగల్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం బస్సు లోయలో పడి నలుగురు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. తమిళనాడు లోని తాంజావూర్ పర్యటనకు వెళ్లిన యాత్రికులు తిరిగి స్వస్థలం అలప్పుజా జిల్లా లోని మావెలిక్కరకు తిరిగి వస్తుండగా,ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు అరుణాహరి (55), రామ్మోహన్ (40), సంగీత (45), బిందు ఉన్నితాన్ (59)గా గుర్తించారు. పర్వత ప్రాంతంలో మలుపు తిరిగే క్రమంలో బస్సు బ్రేకులు ఫెయిలై అదుపు తప్పి 70 అడుగుల లోతు ఉన్న భారీ లోయలోకి పడిపోయిందని పోలీస్‌లు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినది.
- Advertisement -