Monday, December 23, 2024

బురఖా ధరించకపోతే బస్సు ఎక్కకూడదట !

- Advertisement -
- Advertisement -

కలబురిగి: హిజబ్ ధరించనందుకు ఒక విద్యార్థినిని బస్సు నుంచి దించివేశాడు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బస్సు  డ్రైవర్‌పై పాఠశాల హెడ్‌మాస్టర్ కమలాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మసవకల్యాణ్, కలబురగి మధ్య తిరిగే ఆర్టీసీ బస్సును ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు సాయంత్రం స్కూలు అయిపోయిన తర్వాత ఎక్కేందుకు ప్రయత్నించారు. ముస్లిం మతానికి చెందిన ఒక బాలిక పట్ల ఆ బస్సు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. హిజబ్ ధరించనందుకు తాను బస్సులోకి ఎక్కడానికి అనుమతించబోనంటూ డ్రైవర్ అభ్యంతరం తెలిపాడు.

ఆ విద్యార్థిని వెంట ఉన్న టీచర్లు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినలేదు. వారితో కూడా డ్రైవర్ వాదులాటకు దిగాడు. దీంతో తాము ధర్నా చేస్తామని టీచర్లు హెచ్చరించినా అతను కాతరు చేయలేదు. టీచర్ల ఫిర్యాదు మేరకు హెడ్‌మాస్టర్ కమలాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. డ్రైవర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News