Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: కెటి.రామారావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపిని ఎదుర్కొనేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేస్తామని ఇటీవలి తమ సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. రెండు ప్రధాన జాతీయ పార్టీలకు దూరంగానే ఉంటామన్నారు. ఐదు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పరిస్థితి నేడు దయనీయంగా ఉందన్నారు. ఇక ప్రధాని మోడీ అయితే ‘అవినీతి కెప్టెన్’గా ఉన్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతటి అసమర్థ ప్రధానిని తాను చూడలేదన్నారు. తాను స్పృహలో ఉండే ఇలా అంటున్నానన్నారు. కెటిఆర్ బుధవారం మీడియాతో ఈ విషయాలు పంచుకున్నారు.

‘దేశంలో ఓ రాజకీయ లోటు ఉంది. దానిని భవిష్యత్తులో బిఆర్‌ఎస్ పూర్తిచేయగలదు’ అని కెటిఆర్ అన్నారు. జాతీయ పార్టీ అయిన బిఆర్‌ఎస్ మహారాష్ట్రపై, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై తన దృష్టి సారించబోనున్నదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో బిఆర్‌ఎస్ పోటీచేయగలదన్నారు. ఓ పద్ధతి ప్రకారం, దశలవారీగా బిఆర్‌ఎస్ పార్టీని విస్తరిస్తామన్నారు.
‘ఏ పార్టీలోనైనా భేదాభిప్రాయాలు సహజం. అసెంబ్లీ టికెట్‌ను కోరుకుంటున్న వారిలో తగిన అభ్యర్థులనే ఎంచుకుంటాం. గెలుపు గుర్రాలనే కోరుకుంటాం’ అని కెటిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమర్ధతలను గురించి మాట్లాడుతూ ‘ఒకప్పుడు మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కెసిఆర్ వంటి నాయకులను చూడ్డం చాలా అరుదన్నారు. కెసిఆర్ ఉద్యమ నాయకుడిగా నిరూపించుకోవడమే కాదు, అధికారంలోకి వచ్చాక గొప్ప పాలకుడిగా కూడా నిరూపించుకున్నారు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News