Friday, December 27, 2024

రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించి తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ఇక్కడి వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. యుకె పర్యటనలో భాగంగా లండన్‌ను సందర్శించిన కెటిఆర్, అమెరికాలో న్యూయార్క్, వాషింగ్టన్ డిసి, హ్యూస్టన్, హెండర్సన్, బూస్టన్ తదితర నగరాల్లో పర్యటించారు. ఆయా చోట్ల దిగ్గజ సంస్థలతో భేటీ అయ్యారు.

బిఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, బీమా రంగం) ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐటి, ఐటిఇఎస్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్, డాటా సెంటర్స్, ఆటోమోటివ్ అండ్ ఇవి తదితర రంగాల నుంచి పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చేలా కృషి చేశారు. రెండు వారాలపాటు నిర్వహించిన యుకె, యుఎస్ పర్యటన విజయవంతం కావడంతో.. ఈ నాలుగు రోజుల పాటు మంత్రి కెటిఆర్ తన కుటుంబ సభ్యులతో సమయం గడపనున్నారు. నాలుగు రోజుల తర్వాత అంటే ఈ నెలాఖరున కెటిఆర్ హైదరాబాద్ చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News