Monday, December 23, 2024

జవాబుదారీ తనం ఎక్కడ?: ప్రధాని మోడీపై కెటిఆర్ ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

జవాబుదారీ తనం ఎక్కడ?
సోషల్ మీడియా వేదికగా
‘క్యా హువా తేరా వాదా’ హ్యాష్‌ట్యాగ్‌తో
ప్రధాని మోడీపై మరోసారి కెటిఆర్ ప్రశ్నల వర్షం
మన తెలంగాణ/హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించించుకున్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ధి ప్రధాని నరేంద్రమోడీకి లేదని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఎర్రకోట నుంచి సోమవారం ప్రసంగించిన మోడీ 2047 సంవత్సరం నాటికి సాధించాల్సిన కొత్త లక్ష్యాలపై మాట్లాడారు. వినడానికి అవి ఎంతో బాగున్నాయన్న కెటిఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేరలేదన్న సంగతిని మోడీ ఇప్పటికైనా గుర్తించాలని తన ట్విట్టర్ ద్వారా సూచించారు. ప్రధాని నరేంద్రమోడీపై సోషల్ మీడియా వేదికగా మరోసారి ప్రశ్నల వర్షం కరిపించారు. ‘క్యా హువా తేరా వాదా’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో మంత్రి కెటిఆర్ ఓ ఫోటోను అప్‌లోడ్ చేశారు. దాంట్లో మోడీ గతంలో చేసిన ప్రసంగాలను ప్రస్తావించారు. 2022 నాటికి ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించి ఇస్తామన్నారని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్లుగా మారుస్తామని, ప్రతి ఇంటికి కరెంటు సరఫరా చేస్తామని ప్రధాని మోడీ వాగ్దానం చేశారని, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రధాని మోడీ విధించిన ఆ లక్షాలు గొప్పగానే ఉన్నాయని, కానీ 2022 ఆగస్టు 15 నాటికి చేరుకోవాలన్న లక్షాల గురించి ప్రధాని పట్టించుకోవడం లేదని విమర్శించారు. మీ లక్షాలను మీరు గుర్తించలేనప్పుడు జవాబుదారీతనం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. మీ వైఫల్యాలను మీరే గుర్తించలేకపోతున్నారని విమర్శించారు.

KTR Again questions to PM Modi on Past Promises

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News