Sunday, December 22, 2024

అప్పుడే వణికితే ఎలా?

- Advertisement -
- Advertisement -

నేను ఇప్పుడే ఢిల్లీ లో అడుగుపెట్టాను.. అప్పుడే హైదరాబాద్ ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసిందని..అప్పుడే వ ణికితే ఎలా..? అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ నేతలపై ఎక్స్ వేదికగా సె టైర్లు వేశారు. మాజీ మంత్రి కె.టి. రామారావు, తన బృందంతో సోమవారం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవినీతిపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. కాగా.. తెలంగాణ రా ష్ట్రంలో అమృత్ పథకం టెండర్లపై విచారణ జరిపి అక్రమాలు వెలికి తీయాలంటూ గతంలో కెటిఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, టోచన్ సాహులకు లేఖ రాశారు. దీనిపై విచారణ చేసి ని జనిజాలు నిగ్గుతేల్చాలని, లేకుంటే కాంగ్రెస్ ప్ర భుత్వం పాల్పడే అవినీతిలో కేంద్రానికీ వాటా ఉందని నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News