ఎన్నికలు పూర్తి కాగానే భరోసా బంద్
25శాతం మందికి మాత్రమే
రుణమాఫీ జరిగింది కెసిఆర్
11విడతల్లో రూ.73వేల కోట్ల
రైతుబంధు ఇచ్చారు కాళేశ్వరం
జలాలతో నల్లగొండ జిల్లా
సస్యశ్యామలం వరి సాగులో
నల్లగొండను నెంబర్ వన్ చేసిన
ఘనత కెసిఆర్‌దే వేధింపులకు
గురి చేస్తున్న పోలీసులకు వడ్డీతో
సహా చెల్లిస్తాం నల్లగొండ రైతు
మహాధర్నాలో బిఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రభు త్వం రైతుభరోసాను మొదలుపెట్టిందని, ఎన్నికల తర్వాత రైతుభరోసా బంద్ అ వుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నా రు. మంగళవారం నల్లగొండ క్లాక్టవ ర్ సెంటర్ వద్ద జరిగిన రైతు మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీకి మొదట రూ.49,500 కోట్లు అవసరమని చెప్పిన ప్రభుత్వం దా నిని రూ.26 వేల కోట్లకు తగ్గించిందని, ఇందులో కేవలం రూ.12 వేల కోట్ల రూ పాయలను మాత్రమే చెల్లించిందని అ న్నారు.రాష్ట్రంలో కేవలం 25 శాతం మం ది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని తెలిపారు. రైతుబంధు డబ్బులు ఆపడానికి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని, మార్చి 31 వరకూ రుణమాఫీ కొనసాగుతుందని చెబుతున్నారు కానీ ఏ సంవత్సరమో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజల నుండి దరఖాస్తులను తీసుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేకున్నా కేవలం జిరాక్స్ సెంటర్ల యజమానులు మాత్రం ఆనందంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కెసిఆర్ హయాంలో 11 విడతలుగా రైతుబంధు పథకం కింద రైతుల అకౌంట్లలో రూ.73 వేల కోట్లను వేసినట్లు గుర్తు చేశారు.
ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ అని, రైతుబంధు అంటే కెసిఆర్ అని గుర్తొస్తారని చెప్పారు. రాష్ట్రంలో కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారని, ఆ కుట్రలో భాగంగానే తాము ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బందు చేయాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ నేత కంచర్ల భూపాల్ రెడ్డిని అరెస్టు చేయించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డికి దమ్ముంటే గడియారం సెంటర్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు చేసిన మేలు ఏంటో ప్రకటించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లతో తమ నాయకులపై పోలీసులు అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మళ్లీ బిఆరెఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌ను నిలదీయాలి..
అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15000 ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎకరానికి రూ.12000 మాత్రమే ఇస్తానని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కొక్క ఎకరానికి రూ.17,500 బాకీ ఉందని, ఆ డబ్బు చెల్లించాలని రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. సాయుధ తెలంగాణ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని, రైతు సమస్యల పట్ల ప్రభుత్వాన్నినిల దీసేందుకు మరోసారి నల్లగొండ జిల్లా వేదికగా మారాలని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లా సస్యశ్యామలం
నీళ్లు లేక తీవ్ర కరువుతో అల్లాడిన ఉమ్మడి నల్లగొండ జిల్లాను కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలమైన జిల్లాగా మార్చిన గొప్ప నేత కెసిఆర్ అని కొనియాడారు. ఈ ప్రాజెక్టు నీటితో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసనసభలో సవాలు విసిరినా రేవంత్ రెడ్డి తోకముడిచారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి, లేదా కొడంగల్ నియోజకవర్గాలకు వెళ్లి రైతులతో బహిరంగ విచారణ చేద్దామని,
నూటికి నూరు శాతం రుణమాఫీ జరిగిందంటే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరినా రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నల్లగొండలో రైతు ధర్నాకు హైకోర్టు ధర్నాకు అనుమతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపిలు, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌సిలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎంఎల్ఎ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ జడ్పి మాజీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, మాజీ ఎంఎల్ఎలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.