Sunday, December 22, 2024

‘కెటిఆర్, హరీష్ రావులు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు’

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుంది
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మనతెలంగాణ/హైదరాబాద్:  కెటిఆర్, హరీష్ రావులు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబ నేతలను మించిన పవర్ బ్రోకర్లు ఇంకెవరు లేరన్నారు. పది సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీదన్నారు. తాము చేస్తే సంసారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారంలా హరీష్‌రావు, కెటిఆర్‌లు ప్రవర్తిస్తున్నారన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో సొంత పార్టీ ఎమ్మెల్యే, ఎంపిలను కూడా కలవని నీచ చరిత్ర కెసిఆర్‌దని ఆయన ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని, తెలంగాణ భవన్‌ను మూసివేసి స్టార్ హోటల్ గా మార్చి బిజినెస్ చేసుకుంటే హరీష్, కెటిఆర్‌లకు మంచిదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News