Saturday, January 18, 2025

నేడే సిద్దిపేట ఐటి టవర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటి కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానికంగా అక్కడ ఉండే యవత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్షంగా క్రమక్రమంగా నెరవేరుతోంది. ఇందులో భాగంగా రూ.63 కోట్లతో జిప్లస్ 4 అంతస్తుల్లో సిద్దిపేటలో నిర్మించిన ఐటి కేంద్రాన్ని మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులు గురువారం ప్రారంభంచనున్నారు. 2020 డిసెంబర్ 10న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, మంత్రి హరీష్‌రావుతో కలిసి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 1 లక్షా 72వేల 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఐటి టవర్‌లో స్థానికుంగా ఉండే రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడనున్నాయి.ప్రారంభానికి ముందే ఓస్‌ఐడిడిజిటల్, పిక్స్‌టీ టెక్నాలజీస్,అమిడాయ్ ఎడ్యుటెక్, జోలాన్ టెక్, విసన్ ఇన్ఫోటెక్, థోరాన్, టెక్నాలజిస్, బిసిడిసి క్లౌడ్ సెంటర్, ర్యాంక్ ఐటి సర్వీసెస్, కామన్‌సిఎక్స్ ఐటి, ఎంఎసిపిఆర్,అమృత సిస్టమ్, ఇన్నోసోల్, తదితర సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News