Thursday, December 26, 2024

లిక్కర్ కేసు.. కవితకు అండగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన కెటిఆర్, హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులు శుక్రవారం సాయంత్రం హుటాహుటీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ విసృతస్థాయి సమావేశం ముగియగానే వారిద్దరూ ఢిల్లీకి పయనమయ్యారు. రేపు ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించనున్న నేపథ్యంలో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఇప్పటికే పార్టీ లీగల్ టీమ్ సైతం ఢిల్లీకి చేరుకుంది. మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులు అక్కడికి చేరుకున్నాక కవిత, లీగల్ టీమ్‌తో వారు భేటీ కానున్నారు. రెండు రోజులపాటు వారు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్డులో ఉన్న సిఎం కెసిఆర్ ఇంట్లో కవిత ప్రస్తుతం ఉంది. అక్కడే వీరి భేటీ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ ఇద్దరు మంత్రులతో పాటు మరికొందరు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News