Friday, December 20, 2024

తెలంగాణ విద్యార్థుల ప్రయాణ ఖర్చులు భరిస్తాం వారిని ఆదుకోండి

- Advertisement -
- Advertisement -

KTR appeals to Minister of Foreign Affairs for Students stranded in ukraine

విదేశాంగ శాఖ మంత్రికి మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి

ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తాం
విదేశాంగ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు ఒక ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని ఆ ట్వీట్‌లో కేంద్రాన్ని కోరారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కెటిఆర్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో చిక్కున్న తెలంగాణ విద్యార్ధుల విషయంలో వారి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే చొరవ తీసుకుని కేవంల తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులను సకాలంలో స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు.

కాగా ఉక్రెయిన్‌లోని రాష్ట్ర విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్నారు. హెల్ప్ లైన్ సెంటర్లకు రాత్రి నుంచి ఇప్పటి వరకు 75 ఫోన్ కాల్స్ వచ్చినట్లు సిఎస్ వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్ నంబర్- 70425 66955, 99493 51270, 96456 63661లుగా పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News