Wednesday, January 22, 2025

మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొర్లటంపై క్షమాపణ కోరా:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ శనివారం వివరణ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవే కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేయ లేదని వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవా లని కోరారు. రాష్ట్రంలో గత ఎనిమిది నెలలుగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను కమిషన్‌కు వివరించేందుకు కెటిఆర్‌ప్రయత్నించారు. అయితే శనివారం ఒక్క అంశానికి మాత్రమే పరిమితం కావాలని, మిగతా అంశాలపై తర్వాత కలవాలని ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. సమన్లకు లోబడి కెటిఆర్ హాజరై వివరణ ఇచ్చారని, తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతోపాటు క్షమాపణలు చెప్పారని రాష్ట్ర మహిళా కమిషన్ వెల్లడించింది. అటువంటి వ్యాఖ్యలు సరికాదని కూడా కెటిఆర్ అభిప్రాయపడినట్లు పేర్కొంది.

కెటిఆర్ క్షమాపణలను అంగీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్, భవిష్యత్‌లో ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఈ తరహా ఉదంతాలు చోటుచేసుకుంటే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘షాద్ నగర్‌లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. చెంచు మహిళపై దాడి జరిగింది. గురుకుల హాస్టళ్లలో విద్యార్థినులు చనిపోతున్నారు. ఈ సంఘటనను మహిళ కమిషన్ దృష్టికి తెస్తే మళ్లీ రావాలని కోరారు. తప్పకుండా వారు కోరినట్లుగా మళ్లీ సమయం తీసుకొని వస్తాం’మని కెటిఆర్ అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళ కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యా నన్నారు. తాను యథాలాపంగా మాట్లాడిన మాటల పట్ల విచారం వ్యక్తం చేశానని మహిళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడిం చారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొర్లటంపై క్షమాపణ అడిగానని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ తాను కమిషన్ ముందుకు వస్తే మహిళ కాంగ్రెస్ నేతలు మా నాయకులపై దాడి చేశారని వెల్లడించారు. తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మేము వస్తే ఇలాంటి దాడి చేయటం సరికాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News