Monday, December 23, 2024

‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకు కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

KTR as Chief Guest for Bheemla Nayak Pre Release

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే, సంభాషణలను సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ నెల 21న ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు.

KTR as Chief Guest for Bheemla Nayak Pre Release

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News