Wednesday, January 22, 2025

‘తెలుగు, తమిళం చేర్చండి..’ అమిత్ షాకు కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర అధికార భాషలను కలుపుతూ సీఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను సవరించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. సీఆర్పీఎఫ్ పోటీ పరీక్షలు ఇంగ్లీష్, హిందీలోనే నిర్వహిస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పరీక్ష 12 భాషల్లో నిర్వహించాలని జాతీయ నియామక సంస్థ చెప్పిందని, కానీ సీఆర్పీఎఫ్ నియామక నోటీఫికేషన్ లో అమలు చేయటం లేదని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News