Monday, January 20, 2025

త్వరలో హైద్రాబాద్‌లో వార్డు పాలన పద్ధతి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో త్వరలో వార్డుల ప్రాతిపదికన పాలన పద్ధతి తీసుకురావాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్రతి పౌరుడికి వివిధ రకాల సేవలు వీలైనంత త్వరగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. అతి త్వరలోనే హైదరాబాద్ మహానగరం లో వార్డుల పాలన పద్ధతి రానుందని, అందుకు చర్యలు కూడా చేపట్టామని తెలిపారు. బుధవారం సచివాలయంలో మంత్రి కెటిఆర్ పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు.

Also Read: మిడ్ మానేరు బాధితులకు ఇచ్చిన హామీ ఎక్కడ?: బండి సంజయ్

అతి త్వరలోనే హైదరాబాద్‌లో వార్డు పాలన పద్ధతికి శ్రీకారం చుడతున్నామని చెప్పారు. జిహెచ్‌ఎంసిలో ఉన్న 150 వార్డుల్లో వార్డు ఆఫీసులు ఏర్పాటు చేస్తామన్నారు. మే నెలాఖరు లోపు ఈ వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. పాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు వేగంగా పరిపాలన ఫలితాలు అందుతాయన్నారు. వార్డు కార్యాలయంలో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇంచార్జిగా ఉంటారన్నారు. సర్కిల్, జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా వార్డు కార్యాలయంలోనే సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌరులకు అత్యంత సౌకర్యంగా ఉండేలా సిటిజన్ ఫ్రెండ్లీగా జిహెచ్‌ఎంసి వార్డు కార్యాలయాలు ఉంటాయని చెప్పారు. ప్రతి వార్డు ఇంకో వార్డు కార్యాలయంతో అనుసంధానం అవ్వాలని కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News