Thursday, January 23, 2025

ప్రగతిశీల మార్గంలో తెలంగాణ పారిశ్రామిక విధానాలు

- Advertisement -
- Advertisement -

 పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం చాలా ఆదర్శవంతం
 ఇండియాను లక్ష్యంగా చేసుకునే పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుంది
 న్యూయార్క్‌లో ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ పరిశ్రమల విధానాలు ప్రగతిశీల మార్గంలో ఉన్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. న్యూయార్క్‌లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఆ సమావేశాన్ని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఉద్దేశి స్తూ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ సిటీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. న్యూయార్క్ సిటీలోనే తాను చదువుకుని, పనిచేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం చాలా ఆదర్శవంతంగా ఉంటుందని తెలిపారు.

ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొదలుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ మా ట్లాడిన విషయాలను ట్వీట్ చేశారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో తెలంగాణ సర్కార్ ప్రగతిశీల పథంలో వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. తమ విధానాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్ వ్యవస్థను ఉత్తేజ పరిచే విధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. తె లంగాణ ప్రభుత్వం మొత్తం 14 రంగాలకు అధి క ప్రాధాన్యత ఇస్తోందని, ఆ రంగాలకు విస్తృతంగా అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇండియాను లక్ష్యంగా ఎంపిక చేసుకునే పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

ఇదే రౌండ్‌టేబుల్ సమావేశంలో ఇండియన్ కౌన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తం గా వ్యాపార అంశాల్లో.. తెలంగాణ, హైదరాబా ద్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. మం త్రి కెటిఆర్ చురుకుదనాన్ని విశేషంగా మెచ్చుకున్నారు. మంత్రి కెటిఆర్ తన విన్నూత వి ధానాలతో హైదరాబాద్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నారని రణ్‌ధీర్ తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ అఫైర్స్ స్పెషల్ సెక్రటరీ ఈ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News