Thursday, January 16, 2025

ఈడీ విచారణకు హాజరైన కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కెటిఆర్..ఈడీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విచారణకు హాజరైన కెటిఆర్ ను ఫార్ములా-ఈ కేసులో ఈడీ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది.

అంతకుముందు ఈ కేసుపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “దేశంలో, రాష్ట్రంలో.. ఫార్ములా ఈని హోస్ట్ చేయడం నాడు మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమ నాయకులు మా నగరాన్ని ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. పనికిమాలిన కేసులు, చౌకగా బురదజల్లడం, రాజకీయాలు చేయడం ద్వారా ఆ మంచి పనిని తొలగించలేరు. నాకు, బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది. నిన్న, నేడు, రేపు, ఎల్లప్పుడూ ఫార్ములా ఈ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టింది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News