జోగులాంబ గద్వాల: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కెటిఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అబ్రహం, ఎంపి రాములు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో పాటు తదితరులు పాల్గొన్నారు.
మరికాసేపట్లో జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత గద్వాల మండలం గోన్‌పాడ్ వద్ద షాదీఖాన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం సంగాల పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గ్రంథాలయ భవనం, జూనియర్ కళాశాల కోసం భనవ నిర్మాణానికి శంకుస్థాపన, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు, ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు భూమి పూజ చేసిన అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
నది అగ్రహారంలో పీజీ కళాశాలలో నూతనంగా నిర్మించిన మహిళ వసతి గృహాన్ని ప్రారంభించి, అక్కడే అదనపు తరగతి గదులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం లంచ్ అనంతరం 2:45కు అక్కడ నుంచి బయలుదేరి ఆర్వోబీని ప్రారంభించనున్నారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ ముగియగానే అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు మంత్రి కెటిఆర్ బయల్దేరనున్నారు.
KTR Bhoomi Puja for 100 beds hospital at Alampur