Friday, December 27, 2024

మంత్రి కెటిఆర్ కు వినూత్నరీతిలో జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

బస్సుపై సాధించిన ప్రగతిని వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ నేత అలిశెట్టి అరవింద్

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కు ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు 45 అడుగుల వెడల్పు కలిగిన భారీ బస్సుకు ఇరువైపులా మంత్రి కెటిఆర్ సారథ్యంలో సాధించిన విజయాలను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టి హబ్, దుర్గం చెరువు ఫ్లైఓవర్, టి వర్క్స్, నగరంలోని పలు ఫ్లైఓవర్లను ఇందులో పొందుపరిచారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా శుభాకాంక్షలు తెలిపిన నేతగా అలిశెట్టి చరిత్రలో నిలిచిపోనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఈ వాహనం నేటి ఉదయం 6 గంటల నుంచి పది రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో సంచరిస్తుంది.‌ మాటల్లో కాదు అతి తక్కువ కాలంలో అభివృద్ధిని చేసి చూపించిన తమ నేత కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు అలిశెట్టి పేర్కొన్నారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News