Monday, December 23, 2024

నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటా: మంత్రి కెటిఆర్ ఎమోషనల్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

KTR Birth Day Wishes to CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ”అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. దయతో నిండిన హృదయంతో అందరిని ముందుకు నడిపిస్తారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కలిగిన వ్యక్తి.. నా నాయకుడు, నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటా. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి” అని మంత్రి కేటీఆర్ ఎమోషనల్ గా ట్వీట్‌ చేస్తూ తన తండ్రి, సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

KTR Birth Day Wishes to CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News