Friday, December 27, 2024

లండన్ లో కేటీర్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

ఎన్నారై బీఆర్ఎస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్ లో మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ ఎన్నారై టిఆర్ బీఆర్ యస్ యుకె అద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. కెటిఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మరెన్నో ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని బ్రెంట్ ఫోర్డ్ హనుమాన్ హిందూ ఆలయంలో కేటీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించారని తెలియజేసారు. ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. నేడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా IT రంగానికి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం KTR అని చెప్పారు. హైదరాబాద్ ఇంత వేగంగా డెవెలెప్మెంట్ కావడానికి KTR కృషిని గుర్తు చేశారు. ఇక, కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కల మాట్లాడుతూ.. ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ప్రవాస బిడ్డ కేటీఆర్ వెంటే ఉంటామని, హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో, కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపి, ప్రతీ సంవత్సరం లండన్ లో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే సెల్ అద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, ప్రవీణ్ వీర,
హరి గౌడ్ నవాబీపేట్, శ్రీకాంత్ జెల్ల, సత్య చిలుముల, జాయింట్ సెక్రటరీ మల్ల రెడ్డి బీరం, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, రవి ప్రదీప్ పులుసు, రవి రేతినేని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News