Monday, December 23, 2024

కెటిఆర్ బర్త్ డే: టమాటా బుట్టల పంపిణీ..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం దేశంలో టమాటాల ధరలు ఆల్ టైం రికార్డు సృష్టిస్తున్నాయి. దీంతో సామన్య జనాలు టమాటాల వైపు చూడటమే మానేశారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకుల పుట్టినరోజు పురష్కరించుకొని అభిమానులు, కార్యకర్తలు ప్రజలకు టమాటాలను పంచుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ లో చోటుచేసుకుంది. సోమవారం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో ప్రజలకు టమాటాలు పంచారు. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు సంధర్భంగా రాజనాల.. ప్రజలకు చికెన్, లిక్కర్ పంచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News