Wednesday, January 22, 2025

పారిపోలేదు.. ఇక్కడే ఉన్నా

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరెస్టు అవుతారనే ప్రచారంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కెటిఆర్‌గా రాజకీయం మారిపోయింది. కెటిఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విచారణ పూర్తయ్యాకే చర్యలు చేపడతామని.. విచారణ లేకుండా చర్యలు చేపట్టబోమంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తన అరెస్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవ్విల్లూరుతున్నారని కెటిఆర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయంలో శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యంగ్యంగా శుభాకాంక్షలు చెబుతూ కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

‘హ్యాపీ బర్త్ డే రేవంత్ రెడ్డి’ అంటూ ఎక్స్ వేదికగా సిఎంకు బర్త్ డే విషెస్ చెప్పారు. దీంతో పాటుగా.. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో తాను మాలేషియాకు పారిపోయినట్లు వస్తోన్న వార్తలకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎక్కడికి పోలేదని.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చు.. మీ బర్త్ డే సందర్భంగా కావాలంటే కేక్ కట్ చేయిస్తా.. ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా” అంటూ సెటైర్ వేస్తూ కెటిఆర్ ట్వీట్ చేశారు. కెటిఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News