Thursday, January 23, 2025

ఈ నెల 21న కేబుల్ బ్రిడ్జి ప్రారంభించనున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావానికి పూర్వం సరైన కరెంటు అందించలేక ఇబ్బందులు పడ్డ రోజుల నుండి రాష్ట్ర అవతరణ తరువాత 24/7 కరెంటును అందించడంలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపు నిచ్చారు. సోమవారం ఉదయం తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలలో భాగంగా జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ఎస్.ఈ. కార్యాలయం నుండి శుభం గార్డెన్స్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని మేయర్, జిల్లా కలెక్టర్,

విద్యుత్ శాఖ ఎస్.ఈ. లతో కలిసి రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్బావానికి పూర్వం ఎదుర్కోన్న కరెంటు కష్టాలు, ఆవిర్బావం తరువాత సాధించిన విజయాలను గురించి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి పిలుపు నిచ్చారు. భారతదేశం లోనే గోప్ప రాష్ట్రంగా వెలుగోందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన సంస్కరణలతో, కరెంటు కష్టాలు పోయయని అన్నారు.
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీలనః
కరీంనగర్‌లోని నిర్మించిన కేబుల్ బ్రిడ్జి, కొనసాగుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను మంత్రి గంగుల కమలాకర్ పరిశీంచారు. అధికారులకు తగు సూచనలు సలహాలు అందించారు.
21 కేబుల్ బ్రిడ్జి ప్రారంభం ః మంత్రి గంగుల
కరీంనగర్ లోని మానేర్ పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిను ఈనెల 21న ప్రారంభించనున్నమని, ప్రారంభానికి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రానున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రారంభోత్సవాన్ని ఈ నెల 21 న 22 న సాంస్కృతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా కార్యచరణను రూపొందించాలన్నారు. కమాన్ నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా సదాశివపల్లి వరకు రోడ్డు పనులు పూర్తయినందున లైటింగ్ ను ఏర్పాటు చేయాలని, డైనమిక్ లైట్ల్, క్రాకర్ షో, లేజర్ షో మరియు కేబుల్ బ్రిడ్జి ప్రారంభాన్ని ప్రణాళిక ప్రకారం అద్బుతంగా జరిగాలని సూచించారు.

కార్యక్రమంలో చివరగా కేబుల్ బ్రిడ్జి లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, మేయర్ వై. సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఆర్ అండ్ బి ఎస్‌ఈ, ఇరిగేషన్ ఈఈ శివ ప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. గంగాధర్, కార్పొరేటర్లు,ప్రజాప్రతినిధులు, విద్యూత్ శాఖ సిబ్బంది పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News