- Advertisement -
కేంద్రం తీరును నిరసిస్తూ రేపు(శుక్రవారం) అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నాలు దద్దరిల్లాలని పార్టీ శ్రేణులను కెటిఆర్ సూచించారు. వ్యవసాయ అనుబంధ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడం పక్కన పెట్టిన కేంద్రం మొత్తం పథకాన్ని నీరు కార్చేలా అనేక షరతులు, కోతలను తీసుకొచ్చిందని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో కొవిడ్ కష్టకాలం తర్వతా ఉపాధి అవకాశాలు తగ్గాయన్నారు.
గ్రామీణ అర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో చిక్కుకుంటున్నా, కేంద్రం మాత్రం ఉపాధి హమీకి నిధులు తగ్గిస్తూ వస్తున్నదని విమర్శించారు. మరోపైపు పెరిగిన ఎరువులు పెట్రోల్ ధరలు, ఇతర ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుగుతున్నాయని, కనీసం ఇప్పుడైన రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హమీని అనసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -