Monday, January 20, 2025

నందినగర్‌లో ఓటు వేసిన కెటిఆర్ దంపతులు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఈరోజు(గురువారం, నవంబర్ 30) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ లో మంత్రి కెటిఆర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య జనాలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్ లో ఓటు వేశారు.

ఇక, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని క్యాతనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తన సతీమణి రాణి అలేఖ్యతో కలిసి ఓటు వేశారు. నాగార్జునసాగర్‌ హాలియాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌ తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News