Monday, March 31, 2025

ప్రతీకార రాజకీయాలు తగదు

- Advertisement -
- Advertisement -

మాపై కక్షతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న
ప్రభుత్వం సిఎం రేవంత్ స్వాతంత్య్ర
ఉద్యమంలో జైలుకు వెళ్లారా? తెలంగాణ
ఉద్యమంలో నేను జైలుకు వెళ్లా జూబ్లీహిల్స్
ప్యాలెస్‌పైకి ప్రైవేట్ వ్యక్తి డ్రోన్ పంపిస్తే మీరు
ఊరుకుంటారా? రుణమాఫీపై రుజువుకు
సిద్ధమా? సిఎంకు కెటిఆర్ సవాల్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతీకార రాజకీయాల తో రాష్ట్ర ప్రతిష్టతను ప్రభుత్వం దెబ్బతీస్తుందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.టి.రామారావు ఆరోపించారు. మీరు ఎన్నితిట్లు తిట్టినా మాకు ఏమికాదు, మీ తిట్లు మాకు అశీర్వాదాలు, మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది అని అన్నారు. ఆయన స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయిండా, మేము పోలేదా, తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైలుకు మేము కూడా పోయామని కెటిఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ప్యాలేస్ మీదికి ప్రైవేటు వ్యక్తి డ్రోన్ పంపిస్తే మీరు ఊరుకుంటారా? అక్కడ మీ బిడ్డనో, భా ర్యనో ఫోటో తీస్తే ఊరుకుంటారా.. ఎవరింట్ల పడితే వారిట్ల పడతా జోరపడుతా, నా ఇష్టం ఉన్నట్లు జేస్తా అం టే ఊరుకుంటారా? అరాచకం చేస్తా అంటే ఊరుకుంటారా ? ఇది పద్దతేనా అని కెటిఆర్ నిలదీశారు. మీకాడికి వచ్చేవరకు కుటుంబాలు, మీకే భార్యాపిల్లలు, వేరేవాళ్ళకు లేరా భార్యాపిల్లలు, ఆనాడు మీరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు లేవా నీతులు చివరకు మా ఇంట్లో మైనర్ పిల్లలను ఉద్దేశించి బూతులు మాట్లాడింది మీరు కాదా, మీరేదో సానుభూతి కోసం మాట్లాడితే సరిపోతదా అని అన్నారు.

కోర్టులు రిమాండ్‌కు పంపిస్తాయి
జైలుకు ఎవరు పంపుతారు? ప్రభుత్వాలు కాదు, కోర్టు లు పంపుతాయి, కోర్టులో మీ లాయర్లు అడిగారు రిమాండ్‌కు పంపించవద్దని, కానీ కోర్టు మీరు రిమాండ్‌కు పోవాలని కోర్టు చెప్పింది. రిమాండ్‌కు పంపేది మీరు కాదు, మేము కాదు, కోర్టులు అనేది గుర్తించాలని ముఖ్యమంత్రికి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుంఖరిస్తున్నారు, నేను అనుకుంటే అక్కడ ఎవ్వరూ మిగలరు అని మీరు ఏమి అనుకున్నా ఫరక్‌పడదూ.. మీరు ఏమిచేసుకున్నా ఫరక్ పడదూ, మీకు సిఎంపదవి శాశ్వుతం అనుకుంటున్నారు కానీ, ఏదీ శాశ్వుతం కాదు అని కెటిఆర్ ముఖ్యమంత్రికి హితవుపలికారు.

సిఎంలో ఫ్రస్టేషన్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఫ్రస్టేషన్‌లో ఉన్నారు, సిఎంలో రాము, రెమో మాదిరిగా అపరిచితుడు కనిపిస్తున్నాడు, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను అరాచకం చేశారని అంటున్నారు, 14 ఏండ్లుగా ఆర్ధిక శాఖలో రామకృష్ణరావు బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు, మరి ఎందుకు అయన్నే కొనసాగిస్తున్నారని కెటిఆర్ ప్రశ్నించారు. రుణమాఫీపై కొడంగల్ లేదా సరిసిల్లా నియోజకవర్గాల్లో ఏ ఒక్క గ్రామానికైనా వెళ్లి చర్చించేందుకు ప్రభుత్వం సిద్దమా అని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News