Monday, September 23, 2024

అమృత్‌లో అవినీతి లేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమృత్ టెండర్ల అవినీతిలో సిఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సి ఉంటుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. అమృత్ టెం డర్ల అంశంపై సిట్టింగ్ జడ్జితో లేదా సివిసితో విచారణకు సిద్ధమా అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కెటిఆర్ సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిజె దగ్గరకు వె ళ్దామని, అన్ని డాక్యుమెంట్లు సిజె ముందు ఉంచి సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించమని కోరదామని అన్నారు. సిజె వద్దకు
వద్దనుకుంటే ఢి ల్లీలోకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వద్దను వెళదామని పేర్కొన్నారు. తేదీ, సమయం చెబితే ఢిల్లీలో సివిసి వద్దకు తాను వస్తానని, అమృత్ టెండర్లకు సంబంధించిన దస్త్రాలు తీసుకొని సంబంధిత అధికారులను రమ్మనాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులు వచ్చినా, రాకున్నా తాను సివిసికి కచ్చితంగా ఫిర్యాదు ఇస్తానని వెల్లడించారు. సిఎం, మంత్రి పొంగులేటి హైకోర్టు సిజె దగ్గరికి వస్తారో, సివిసి దగ్గరికి వస్తారో తేల్చుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, తాటికొండ రాజయ్య, బాల్క సుమన్, హరిప్రియ, వాసుదేవరెడ్డి తదితరులతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని ఊడగొట్టేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం మెడకు చుట్టుకుంటుందని కెటిఆర్ అన్నారు. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారు..? అని ప్రశ్నించారు. చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్ రెడ్డి తరచుగా చెప్తున్న ఫోర్త్ సిటీ కాదు అని.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు.సింగరేణి కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు, బోగస్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటోందని విమర్శించారు. ఒక్కో కార్మికుడికి సంస్థ లాభం రూ.4,701 కోట్లలో 33 శాతం ఇస్తే రూ.3.70 లక్షలు అందాలని స్పష్టం చేశారు. కెసిఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి కలిసి సింగరేణిని ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తున్నాయని కెటిఆర్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News