Saturday, December 21, 2024

రేవంత్ ను వదిలిపెట్టం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అలవిగాని హామీలు ఇచ్చారని, ఆయన ప్రతి మాటకూ తమ వద్ద రికార్డు ఉందనీ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ ను వదిలిపెట్టబోమన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారని, నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా 15 వేల రూపాయలను రైతు భరోసా కింద అందజేస్తామని చెప్పి, ఇంకా ఇవ్వలేదని అన్నారు.

రుణ మాఫీ చేయడానికి తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని కేటీఆర్ చెబుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఎలా చేస్తుందో చూస్తామన్నారు. తాము చేసిన ప్రతి అప్పుకూ ఆడిటి రిపోర్ట్ ఉందన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చేముందు ఆదాయావ్యయాల లెక్కలు చూసుకుంటారని, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News