Monday, November 18, 2024

బిఆర్‌ఎస్ గెలవబోయే తొలి ఎంపీ సీటు సికింద్రాబాద్ : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయటం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేతనైతలేదని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో రోజుకో లీక్ ఇచ్చి సిఎం రేవంత్ రెడ్డి టైమ్ పాస్ చేస్తుండని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం సాయంత్రం ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొత్త కదా కొన్ని రోజులు భయపెట్టే పని చేస్తారని, కేడర్ ధైర్యంగా ఉండాలని అండగా పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే 20 రోజుల పాటు కలిసికట్టుగా అందరం పనిచేద్దామని లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటుదామన్నారు.

మత విద్వేషాల పేరుతో బిజెపి చేసే చిల్లర రాజకీయాలను పట్టించుకోవద్దన్నారు. పార్టీ మారిన ఎంఎల్‌ఎ దానం నాగేందర్ సీటు పోవటం ఖాయమని, ఉప ఎన్నిక రావటం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డిని కూడా ఓడించేది ఒక్క బిఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. కిషన్ రెడ్డి కరోనా టైమ్‌లో సికింద్రాబాద్‌లో కుర్ కురే ప్యాకెట్లు పంచాడని దుయ్యబట్టారు. దేశంలో విపక్షాలు ఐతే జేబులో లేదంటే జైల్లో అన్నట్లుగా ఉంది ప్రధాని మోడీ విధానం ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సిఎం అయిన తర్వాత విచిత్రమైన పరిస్థితి కనబడుతోందన్నారు. రేవంత్ రెడ్డి అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు. మోడీ కోసమా? రాహుల్ గాంధీ కోసమా? అని ప్రశ్నించారు. మైనార్టీలు కాంగ్రెస్‌కు వేసే ఒక్కో ఓటు అది బిజెపికే వెళ్తుందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి కుసంస్కారి, మూర్ఖుడు అని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News