Monday, December 23, 2024

వామ్మో… ఆ హత్య షాక్ కు గురి చేసింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్య తనని షాక్ కు గురి చేసిందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో తెలిపారు. క్రూరమైన హత్య భయాందోళనకు గురి చేసిందని మండిపడ్డారు. అనాగరిక హింసకు సమాజంలో చోటులేదని స్పష్టం చేశారు. ఈ మర్డర్ కేసులో నిందితులకు ఫాస్ట్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ట్విట్టర్‌లో కెటిఆర్ డిమాండ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకురాలు నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన ఓ టైలర్ గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News