Monday, April 14, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం 3డి మంత్రాను అమలు చేస్తుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మోసం.. విధ్వంసం.. దృష్టి మళ్లించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని, సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానని తెలిపారు. తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అటవీ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, భారీ నేరానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఓ బిజెపి ఎంపి పూర్తి స్థాయిలో సహకరించారని ఆరోపణలు చేశారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మేహక్కు ప్రభుత్వాలకు ఉండదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3డి మంత్రాను అమలు చేస్తుందని కెటిఆర్ మండిపడ్డారు.

400 ఎకరాలకు టిజిఐసికి యజమాని కాదని కెటిఆర్ అన్నారు. తనది కాని భూమిని టిజిఐఐసి తాకట్టు పెట్టిందని తెలిపారు. మోసపూరిత భూమిని తాకట్టు పెట్టుకుని బ్యాంకు రుణం ఇచ్చిందని, 400 ఎకరాల భూమి విలువ రూ. 5,239 కోట్లు అని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ చెబుతుందని కెటిఆర్ వివరించారు. అదే భూమి విలువ రూ. 30 కోట్లు అని రెవెన్యూశాఖ చెప్పిందని, నిబంధనలు తుంగలోతొక్కి ఆర్థిక నేరానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఆర్థిక నేరంపై దర్యాప్తు కోసం లేఖలు రాస్తున్నానని, కేంద్రం, ఆర్బీఐ, సివిసి, సెబి, ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు చేయమని కోరుతున్నామన్నారు. తనకు అండగా నిలబడిన బిజెపి ఎంపికి రేవంత్ రెడ్డి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని, కుంభకోణానికి సహకరించిన బిజెపి ఎంపి పేరు వచ్చేఎపిసోడ్ లో బయటపెడతానని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News